_పటాన్ చెరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తిస్థాయిలో పని చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని కోరారు.
అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ , పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించే నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న మొట్టమొదటి నియోజవర్గం పటాన్చెరు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా నియోజకవర్గంలో 90% క్రీడా ప్రాంగణాలు ప్రారంభించడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
పటాన్ చెరు మండల పరిధిలోనీ 9 అంగన్ వాడి కేంద్రాల భవనాల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని, ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముత్తంగి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎల్లప్పుడు తాను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా పటాన్ చెరు బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో 16 కోట్ల రూపాయలతో భారీ ఆడిటోరియం నిర్మిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల సమయాల్లోనే రాజకీయాల గురించి మాట్లాడాలని, తదనంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా చర్చలు జరగాలని కోరారు. ప్రస్తుత హైటెక్ యుగంలోనూ కొన్ని కొన్ని చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, తాసిల్దార్ మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…