Telangana

యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పెద్దగొల్ల మల్లేష్ యాదవ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణం యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ నియామకమయ్యారు. ఆదివారం పటాన్ చెరు పట్టణం యాదవ సంఘం కార్యవర్గాన్ని, యాదవ సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతవారం యాదవ సంఘం అధ్యక్షునిగా దేవయ్య యాదవ్ ను ఎన్నుకున్న సంగతి విధితమే. ఈ సందర్భంగా యాదవ సంఘం ఉపాధ్యక్షులు పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ  గతవారం యాదవ సంఘం అధ్యక్షుడిని, ఇప్పుడు ఉపాధ్యక్షుడు, కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సభ్యులందరితో కలిసి యాదవ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. యాదవ సంఘం సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ల సలహాలు, సూచనలతో యాదవ సంఘం అభ్యున్నతికి కష్టపడి పని చేస్తామని తెలిపారు. తమ నియామకానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన యాదవ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, కార్యవర్గం సభ్యులు కృష్ణ, నర్సింహ, మల్లేష్, బిక్షపతి యాదవ్, మల్లేష్ యాదవ్, నర్సింలు యాదవ్, భీమన్న యాదవ్, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, జంగులు యాదవ్, నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…

8 minutes ago

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…

19 hours ago

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…

2 days ago

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…

2 days ago

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…

2 days ago