మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అయితే శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సరికాదని, ఇలాంటి చర్యలకు బీజేపీ కార్యకర్తలు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండకల్ ఆనంద్ కుమార్, ములుగు జిల్లా ఓబీసీ ఇంచార్జ్ బుర్ర మహేందర్ యాదవ్, మాదాపూర్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి శివ యాదవ్, మాదాపూర్ డివిజన్ మాజీ కార్యవర్గ సభ్యులు రాజ వర్ధన్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బీజేవైఎం మాజీ జనరల్ సెక్రెటరీ లింగస్వామి శేరిలింగంపల్లి యువమోర్చా సభ్యులు హర్షిత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
