పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మూడు కోట్ల 30 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
30 లక్షల రూపాయల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు డివిజన్ సమగ్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో మూడు కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా విస్తరిస్తున్న పటాన్‌చెరు డివిజన్, జేపీ కాలనీ డివిజన్ల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్లు, యూజీడిలు, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
30 లక్షల రూపాయల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని చోటి మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గల స్థలంలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎల్లప్పుడూ తాను ముందుంటానని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్ కిరాయిల ద్వారా మసీదు నిర్వహణకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్‌చెరుడిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, మైనార్టీ మత పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్: సమ్మక్క…
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కమిషనర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఎంటెక్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న…
ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన డాక్టర్ అర్షియా సేథి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: చట్టాలను మనం గౌరవిస్తే, అవి మనకు…
ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు.. అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు 77 మీటర్ల జాతీయ జెండాతో…
పటాన్‌చెరులో ఘనంగా ముగిసిన 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు మనవార్తలు ప్రతినిధి…