గెటిఆర్ఎస్ యువనాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ధీమా
పటాన్చెరు
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి మద్దతుగా పటాన్చెరు టిఆర్ఎస్ యువనాయకుల బృందం ప్రచారం నిర్వహించింది. గురువారం హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ భారీ విజయానికి గెలుపు బాటలు గా మారుతున్నాయని అన్నారు.
ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్, విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ కృష్ణకాంత్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు చెన్నారెడ్డి, నాయకుడు తరుణ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, సోహైల్ ఖాన్, రవికుమార్, సంపత్, జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…