పటాన్‌చెరు గడ్డ BRS అడ్డా
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
స్కాముల ప్రభుత్వం పోయి స్కీముల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు
సిగాచి మృతులకు నమ్మకద్రోహం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే
మున్సిపల్ ఎన్నికల్లో యావత్తు తెలంగాణ బిఆర్ ఎస్ వైపే చూసింది
ఐదు మున్సిపాలిటీలు గెలుచుకొని బిఆర్ఎస్ సత్తా చాటారు
అద్భుతమైన స్వాగతం పలికిన బిఆర్ ఎస్ గులాబీ కార్యకర్తలకు కృతజ్ఞతలు
ఎస్ ఐ ఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు
ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ గులాబీ శ్రేణులు
ఓ ఆర్ ఆర్ జంక్షన్ నుండి జిఎంఆర్ కన్వెన్షన్ వరకు గులాబీమయం..
తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు
జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్
ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు గడువున్న అద్భుతమైన స్వాగతం పలికారని కితాబునిచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు
ప్రతి ఓటు హక్కును కాపాడుకుంటాం
రెండు లక్షల సభ్యత్వంతో కేసీఆర్ కి గిఫ్ట్ అందిస్తాం
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
అర చేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని స్కామ్‌ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఎస్ ఐ ఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ నుండి పటాన్‌చెరు పట్టణం మీదుగా జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డిల నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణులు వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీవులతో హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో పటాన్‌చెరు పట్టణాన్ని గులాబీమయం చేశారు.అనంతరం జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలోని పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు గడువు ఉన్నప్పటికీ పటాన్‌చెరు బిఆర్ఎస్ శ్రేణులు అందించిన స్వాగతం మరిచిపోలేదని అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు తెలంగాణ మీ వైపు చూసేలా చేశారని కితాబునిచ్చారు. పటాన్‌చెరు అడ్డ బిఆర్ఎస్ గడ్డ అని ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు సర్ ను సీరియస్‌గా తీసుకోవాలని, బిఎల్ ఓ లను చురుకుగా పనిచేయించాలని సూచించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.30 వేల కోట్ల విలువైన భూములను విక్రయించిందని ఆరోపించిన ఆయన, బిఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకుండా అందాల పోటీలు, బోధి భవన్ వంటి కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ, ఇతర కార్యక్రమాలకు నిధులు ఉన్నా పేదల సంక్షేమానికి నిధులు లేవని ఆరోపించారు.సిగాచి ప్రమాదంలో 54 మంది మృతి చెందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని, కంపెనీ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని విమర్శించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పటాన్‌చెరు పట్టణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడం చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు.పటాన్‌చెరులో IT పార్క్ కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం విక్రయించిందని ఆరోపించారు.రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బిఆర్ ఎస్ గెలుస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సీట్ల సంఖ్య పెరిగినా వాటిని కూడా బిఆర్ ఎస్ పార్టీ గెలుచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తామని చెబుతున్నప్పటికీ, తొమ్మిది సీట్లకు మించి గెలవలేదని ఎద్దేవా చేశారు.
అనంతరం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ అంశంపై బూత్ లెవెల్ స్థాయి నుండి కార్యకర్తలను అప్రమత్తం చేయడంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రతి ఓటును కాపాడుకుంటున్నామని తెలిపారు. త్వరలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ అంశంలోనూ రెండు లక్షల సభ్యత్వం నమోదు చేసి కేసీఆర్ కు బహుమతిగా అందిస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…