politics

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

15 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన పటాన్‌చెరు ఎం ఎల్ ఎస్ పాయింట్ వే బ్రిడ్జి ప్రారంభం

అతి త్వరలో సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్ లోనూ వే బ్రిడ్జిలు ఏర్పాటు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

రేషన్ డీలర్ల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.స్టాక్ పాయింట్లో ధాన్యం తూకం వేసే సమయంలో డీలర్లు నష్టపోవద్దన్న లక్ష్యంతో పటాన్చెరులోని ఎంఎల్ఎస్ పాయింట్ లో 15 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన వే బ్రిడ్జి ను మంగళవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కలిగిన రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

స్టాక్ పాయింట్లలో వే బ్రిడ్జి లేకపోవడం మూలంగా ధాన్యం ధూపం వేసే సమయంలో ప్రతిసారి నష్టపోతున్నామని గతంలో రేషన్ డీలర్లు తన దృష్టికి తీసుకునే రావడం జరిగిందని వెంటనే సొంత నిధులు కేటాయించి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు చేయాల్సిన పని తాను చేయడం జరిగిందని గుర్తు చేశారు. అతి త్వరలో సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్ స్టాక్ పాయింట్లలోనూ వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని డీలర్లు కోరగా వచ్చే రెండు వారాల్లో బ్రిడ్జి ల ఏర్పాటునకు శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్లలో వే బ్రిడ్జి లు ఏర్పాటు చేసి రేషన్ డీలర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించడం జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రేషన్ డీలర్ల సంక్షేమం కోసం 15 లక్షల రూపాయలు సొంత నిధులతో వే బ్రిడ్జి ఏర్పాటు చేసిన ఘనత. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కే దక్కిందని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు ప్రశంసించారు. తమ సంక్షేమం ఆర్థిక అభ్యున్నత కోసం అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అనంతం, జిల్లా ఉపాధ్యక్షులు జయప్రకాష్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, వెంకటేష్, ధనరాజ్ గౌడ్, రాజు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

5 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

23 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

23 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

24 hours ago