Telangana

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డారం గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని అంతిమంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతి త్వరలోనే గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో పార్టీ పట్టిష్టతకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కార్యకర్తలకు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఇస్నాపూర్ మున్సిపల్ పాలకమండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పటాన్‌చెరు మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మోటె సుమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, రాములు గౌడ్, మోటె కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

14 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

15 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago