టియుడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ సమావేశం ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి టియుడబ్ల్యూజే ఐజేయు కార్యవర్గాన్ని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టు మిత్రులందరూ సమావేశానికి తప్పక హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశానికి టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏకె ఫైజల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆసిఫ్, ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రెటరీ చెన్న బసవేశ్వర్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, జర్నలిస్టుల సమస్యలు, సంఘం బలోపేతం, నియోజకవర్గ స్థాయిలో కార్యవర్గ ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ వెల్లడించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…