మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ చత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, సీనయ్య తదితరులు పాల్గొన్నారు..
