Telangana

70ఏళ్ల చరిత్ర గల సంఘం మనది

– అక్రిడేషన్లు, బస్సుపాస్ లు ఇప్పించిన‌ ఘనత టీయూడబ్ల్యూజే–ఐజేయూ ది

– క్రమశిక్షణ గల సంఘం మనది

– ఐజేయూ జాతీయ సమావేశంలో సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అందరం కలిసి కట్టుగా సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు-ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ ఫైజల్ అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం TUWJ-IJU విస్తృత స్థాయి సమావేశాన్ని రామచంద్రాపురం లోని లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్ మాట్లాడుతూ 70ఏళ్ల చరిత్ర ఉన్న యూనియన్ టీయూడబ్ల్యూజే–ఐజేయూ లో క్రమశిక్షణకు మారుపేరులాంటిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు బస్సు పాస్ సౌకర్యం కల్పించడంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ పాత్ర మరవలేనిదని చెప్పారు.

జిల్లాలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులను ఇప్పించడం జరుగుతుందని అన్నారు. జర్నలిస్టుల అరోగ్య భద్రత, హక్కుల పరిరక్షణకు పాటుపడుతుందన్నారు. నియమనిబంధనలతో సంఘం పనిచేస్తుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ మన సంఘంలో ప్రతి జర్నలిస్టుకు గౌరవం దక్కుతుందన్నారు. జర్నలిస్టుల గౌరవం, భద్రత, హక్కుల విషయంలో అవసరమైనప్పుడు సంఘటితంగా గొంతెత్తాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ పటాన్ చెరు జర్నలిస్టుల సమిష్టి కృషితోనే‌ అంచలంచలుగా జిల్లా స్థాయికి ఎదిగానని చెప్పారు.

ఇక్కడి జర్నలిస్టులకు రుణపడి ఉంటానంటూ సభావేదిక ద్వారా పాదాబివందనం చేస్తున్నట్లు తెలిపారు. సంఘం బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి చెన్న బసవేశ్వర్ అధ్యక్షత వహించిన సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసీఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జాయింట్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్, ఈసీ మెంబర్లు మజీద్, శ్రీనివాస్, ఫోటో గ్రాఫర్ జిల్లా అధ్యక్షుడు ఆరీప్, చిన్న,మధ్య తరహా పేపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దిఖ్, జనరల్ సెక్రటరీ ఈశ్వర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

పటాన్ చెరు అసెంబ్లీ టీయూడబ్ల్యూజే–ఐజేయూ నూతన కార్యవర్గం

అనంతరం పటాన్‌చెరు నియోజకవర్గం నూతన అధ్యక్షునిగా పత్తి నర్సింహా, ప్రధాన‌కార్యదర్శిగా యాదగిరి, సలహాదారులుగా కాశీపతి, సులేమాన్,రామారావు, ఉపాధ్యక్షులు గా విఠల్, నగేష్, శివకుమార్, జెమిని రాజు, రమేష్, జీవరత్నం, జాయింట్ సెక్రటరీలుగా వేణు, ప్రభాకర్, శ్రీనివాస్, కోటేష్, శివాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆంజనేయులు, గాండ్ల మహేష్, వివేక్, రాజు, కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మెంబర్లు గా శ్రీనివాస్, శంకర్, శేఖర్, మహేందర్ గౌడ్, సిద్దు, శ్రీనివాస్ మామా, రాజశేఖర్, ప్రదీప్ రెడ్డి, విజయ్, నాయుడు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి రాష్ట్ర, జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago