Telangana

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదుః ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మూలంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, ప్రతిపక్ష పార్టీలు డిపాజిట్ల కోసం పోరాడాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన నవ చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు మన్నె నవీన్ ఆధ్వర్యంలోని యువకుల బృందం ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 9 ఏళ్ల పరిపాలనలో ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధికి ప్రతీకలుగా నిలపడంతో పాటు, ప్రతి పేదవాడి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో లక్ష రూపాయల నిధుల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో ఉండేవని, నేడు ప్రతి గ్రామం కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది అని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాల్సిన ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారానికి పరిమితమవుతున్నాయని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ మన్నె రాజు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago