బొల్లారం
బొల్లారం పురపాలక సంఘంలోని కోవిద్ వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. బొల్లారంలోని 8 వ వార్డులో 18 సెప్టెంబర్2021 నాటికి వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తయింది. వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసుకున్న సర్టిఫికేట్‌ను 8 వార్డు కౌన్సిలర్ చైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ , పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక చేతుల మీదుగా అందించారు .కోవిద్ 19 మొదటి ,రెండవ విడత వాక్సిన్ వేయించుకున్న 8 వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ ఛైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా.. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలన్నారు .కోవిద్ థర్డ్ వేవ్ వచ్చినా వాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు .. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొదటి , రెండవ విడత వాక్సినేషన్ ప్రక్రియకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కొలాన్ రోజా బాల్ రెడ్డి అన్నారు .
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఆర్‌ఓ శ్రీధర్ , హెచ్‌ఈఓ వెంకటరమణ, శానిటేషన్ ఇన్సెక్టర్ వినోద్, PHN స్వరూప రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…