మనవార్తలు , పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) సంయుక్తంగా ఈనెల 28 న గీతం ప్రాంగణంలో ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . వ్యాపారం చేయాలనే ఆలోచన దశ నుంచి వాణిజ్యీకరణ వరకు వ్యవస్థాపక ప్రయాణం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు . మనదేశంలోని స్టార్టప్లు , వ్యవస్థాపకులకు వివిధ సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు , రాయితీలు , సహాయ వ్యవస్థలపై అంతర్దృష్టులను అందించడం ఈ సమ్మేళనం లక్ష్యమన్నారు .
యువతలో పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచనను కల్పించడం , పరిశ్రమ స్థాపనకు అవసరమైన మెళకువలను తెలియజేయడం , ప్రతిపాదిత స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం చేయడం ఈ సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు . సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వివిధ సంస్థల నిపుణులు , వ్యవస్థాపక ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న ముఖ్య అధికారుల ఆలోచనలు , అనుభవాలను ఈ వేదిక నుంచి పంచుకుంటారని డెరైక్టర్ తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో బృంద చర్చలు , విజయగాథలు , సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి వంటి వాటిపై నిపుణుల మార్గదర్శనం ఉంటుందన్నారు . ఇవన్నీ పరిశ్రమ నెలకొల్పాలనే యోచన ఉన్నవారికి ఓ లోతైన అవగాహన కల్పిస్తాయని ఆయన తెలిపారు . యూజీ , పీజీ విద్యార్థులు , పరిశోధకులు , అధ్యాపకులు , వర్ధమాన పారిశ్రామికవేత్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చన్నారు . పేర్ల నమోదు , చివరి తేదీ వంటి వివరాల కోసం 98490 66459 ని సంప్రదించాలని , kkuchima@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని లేదా www.ghbs.in ను సందర్శించాలని ప్రొఫెసర్ కరుణాకర్ సూచించారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…