_గాయపడిన కార్మికులకు 25 లక్షల రూపాయలు. ఎక్ష గ్రేసీయా ఇవ్వాలి -సిపిఐ
మనవార్తలు ,నంద్యాల:
నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు,గాయపడిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు ,సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్ .రంగనాయుడులు డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని త్వరగా పనులు పూర్తి చేయాలని కార్మికులపై ఎక్కువ పని భారంమోపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు . ప్రమాదం జరగడానికి కారకులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .
మరణించిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయలు, ప్రమాదంలో గాయపడిన ప్రతి కార్మికుడికి 25 లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నంద్యాల జిల్లాలో ని సిమెంట్ ఫ్యాక్టరీ లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో కూడా గడివేముల ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటన జరిగిన ఫ్యాక్టరీ యజమాన్యం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని గుర్తు చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .
గతంలో పాలిమర్స్ కంపెనీలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు ఇచ్చారని వారు గుర్తు చేశారు . మృతి చెందిన ప్రతి కార్మికుల కుటుంబానికి ఇచ్చి ఆదుకుని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు .