మన వార్తలు శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనిలోని వీఆర్ అశోక్ గ్రాండ్ లో బీజేపీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మొవ్వా సత్యనారాయణ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలే భాస్కర్ మాట్లాడుతూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఓబీసీ కమిషన్ కు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించిన మాన్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిసి లకు 2500 కోట్లు,నాయి బ్రాహ్మణ కుల సోదరులకి మరియు రజక సోదరులకు చేరో 250 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని, సెలూన్ షాపులకు మరియు దోభి ఘాట్ లకు ఉచిత కరెంట్ హామీని ఇస్తానని చెప్పి ఇంతవరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా వీరికి ఉచిత కరెంటు, నిధులు ఇవ్వాలని తీర్మాణం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు ఉన్నటువంటి 34 శాతం రిజర్వేషన్ ని తెరాస ప్రభుత్వ 23 శాతానికి తగ్గించి స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీ నాయకత్వానికి అన్యాయం చేసిన కేసీఆర్ వెంటనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలని తీర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్ రావు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, రాజు, వెంకటేష్, దశరథ్ సాగర్, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…