రామచంద్రపురం
తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా గొర్రెలతో పాటు మేపేందుకు ప్రతి గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి చేపడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెలతో పాటు స్థలం కేటాయిస్తే గొర్రెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు.
గ్రామాల్లో ఉండడానికి ఇండ్లు సరిపడక ఇబ్బందులు పడుతున్న గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంపకం కష్టంగా మారిందన్నారు. స్థలం లేక మొదటి విడతలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను పెంచడానికి, మేపడానికి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం గొర్రెలతో పాటు వాటిని మేపేందుకు స్థలం కేటాయిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదే విధంగా గతం లో ఉన్న గొర్రెలకు కూడ ఇన్సూరెన్సు వర్థింపచెయలని చుచించారు. రెండో విడత పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు గొర్రెలతో పాటు ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…