మనవార్తలు ,హైదరాబాద్:
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11 లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మ్ ఆరా స్కిన్ అండ్ హేర్ క్లినిక్ ను ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ముఖ్యం గా గ్లామర్ రంగం లో ఉండే వాళ్ళు ప్రతీ సినిమాకు విభిన్నంగా, అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని ఆ సమయం లో మాకు అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎంతో సహకరిస్తుంటారని అన్నారు. ప్రస్తుతం సినీ, టీవీ ప్రముఖుల కంటే సోషల్ మీడియాలో లక్షలాదిమంది ఫేమస్ అవుతున్నారని వారు కూడా ఇప్పుడు స్కిన్, హెయిర్ కాపాడుకోవడానికి, మెరుగులు దిద్దుకోవడానికి పరుగులు తీస్తున్నారని, అలాంటి వారికి ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న డెర్మ్ ఆరా స్కిన్ అండ్ హెర్ లాంటి డెర్మటాలజీ క్లినిక్ లు ఉపయోగపడతాయని అన్నారు. వైద్యురాలు సుమ దివ్య మాట్లాడుతూ నగరంలోని తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యూఎస్‌ఎఫ్‌డీ అప్రూవ్డ్ సాంకేతిక యంత్రపరికరాలు వాడుతున్నామని, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన వైద్యులతో, సిబ్బందితో తాము సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త పింకీరెడ్డితో పాటు పలువురు వైద్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…