_వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_వృద్ధాశ్రమానికి ఐదు లక్షల రూపాయల విరాళం
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలోని చివరి అంకంలో కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వృద్ధాశ్రమంలో చేరే వృద్ధుల ఆలనా పాలనా చూసేందుకు ఆశ్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోను సొంత నిధులతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహనకు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, ప్రముఖ సినీ వ్యాఖ్యాత సుమ కనకాల, నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…
పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువత…
ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మన దేశ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…