రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన నీలం మధు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రోడ్డు ప్రమాదంలో గాయపడి సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బొల్లారం డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నీలం మధు ముదిరాజ్ మంగళవారం పరామర్శించారు.ఆయనకు సంబంధించిన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా తక్షణ సహాయం కింద యాబై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధితుడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *