Telangana

నరకప్రాయంగా నేషనల్ హైవే 65

– గడువు దాటినా పూర్తి కాని జాతీయ రహదారి పనులు

– నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

సంగారెడ్డి ఎక్స్‌రోడ్స్ నుంచి మదీనగూడ వరకు ఎన్‌హెచ్‌-65పై చేపట్టిన 6 వరుసల రహదారి విస్తరణ పనులు నిర్ణయించిన గడువు దాటినా పూర్తికాకపోవడంపై నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కిలోమీటర్ 493/000 నుంచి 524/000 వరకు 29.35 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 1,297.75 కోట్ల వ్యయం మంజూరైంది. అసలు పూర్తి గడువు 03-07-2026 కాగా, అనంతరం కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ సమాచారంలో 31-03-2027 గడువు పొడిగించినట్లు తెలిసింది. అదే సమాచారంలో ప్రస్తుత ప్రాజెక్టు పనులు 32 శాతం మాత్రమే పూర్తయినట్లు పేర్కొన్నారు.రూ. 1,297 కోట్లకు పైగా ప్రజాధనంతో చేపట్టిన 29.35 కిలోమీటర్ల పనుల్లో ఇప్పటివరకు 32 శాతం మాత్రమే భౌతిక పురోగతి నమోదవడం, మిగిలిన పనులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశమని మెట్టు శ్రీధర్ అన్నారు.

ఎక్కడ చూసినా సగం పనులు చేసి వదిలేయడం, పూర్తి స్థాయిలో రహదారి పనులు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కొద్ది కిలోమీటర్ల ప్రయాణానికే గంటల తరబడి సమయం పడుతోందని, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు.అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణంలోనూ నాణ్యతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. నిర్మాణ ప్రాంతాల్లో భారీగా దుమ్ము లేవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దుమ్ము నియంత్రణకు క్రమం తప్పకుండా నీటిని చల్లడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, పనుల నాణ్యతను పరిశీలించాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. నాణ్యతా లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో పాటు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.రహదారి, సర్వీస్ రోడ్లు, బాక్స్డ్రైన్, నిర్మాణ సామగ్రి తదితర పనులపై నాణ్యతా పరీక్షలు నిర్వహించి, లోపాలు ఉన్నట్లు తేలితే వాటిని కాంట్రాక్టర్‌తో సరిచేయించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన రహదారిని అందించాలని, ప్రజాధనం భారీగా ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్టులో నాణ్యత, భద్రత, సమయపాలన విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

32 minutes ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

1 hour ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

7 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

19 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

19 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

19 hours ago