_సూసైడ్ నోట్ లో స్పష్టంగా తెలిపిన అన్నదమ్ములు యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి లు
మనవార్తలు ,మేడ్చల్ జిల్లా :
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం , అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి 34 సం”లు, మహిపాల్ రెడ్డి 29 సం”లు రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి లు గత 9 నెలల క్రితం యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి ల తల్లి ప్రేమిలా అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేని కొడుకులు చివరకు సూసైడ్ నోట్ రాసి యాదిరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు , సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.