Telangana

సీసీ రోడ్డు రోడ్డు పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ :

రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్‌లోని సైబర్ కాలనీ బి మ్యాథ్స్‌లో రూ.7 లక్షల వ్యయంతో 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ సొంత నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు కంజర్ల శ్రీశైలం, నాగరాజు, బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు దయాకర్ రెడ్డి, గుడ్ల సాగర్, ఇంద్రారెడ్డి, బొల్లారం శ్రీశైలం, గ్రామస్తులు రవీందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, కుమ్మరి రాజు, మల్లయ్య, శ్రీశైలం, B మ్యాథ్స్ అధ్యక్షుడు కె. సంజీవ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పి. మాధవరావు, ప్రధాన కార్యదర్శి డి. ఏడుకొండలు, సంయుక్త కార్యదర్శి బి. ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి జె. వాసుదేవరావు, డైరెక్టర్లు వి. గోవర్ధన్, ఎం. సందీప్ రెడ్డి, యు. సురయ్య, ఎం. ఆనంద్, మాజీ అధ్యక్షుడు జె. శివనారాయణ పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago