మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పటాన్చెరు, ముత్తంగి డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్ ప్యారడైజ్ కాలనీలో 67.5 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్లు, ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీలో 36.5 లక్షల రూపాయలతో చేపట్టనున్న పైపులైను నిర్మాణ పనులు, వెలిమల స్మశాన వాటికలో 36.08 లక్షల రూపాయలతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి కాలనీని అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, విజయ్ కుమార్, ఉపేందర్, దేవేందర్ యాదవ్, కొమరయ్య, శ్రీశైలం, ఉమేష్, నాగరాజు, రవీందర్ రెడ్డి, నర్రా బిక్షపతి, కుమార్ గౌడ్, ప్రభాకర్, మేరాజ్ ఖాన్ రామకృష్ణ వెంకటేష్, అశోక్, రాజ్ కుమార్, రామకృష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు.
