పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన 35వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటి తరం యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35వ మైత్రి క్రికెట్ ట్రోఫీని ఆదివారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఆధునిక వసతులతో మైదానాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గత 35 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత మైత్రి క్రికెట్ క్లబ్ కి దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, పారిశ్రామికవేత్తలు కే. సత్యనారాయణరెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, సిఐ వినాయక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహ రెడ్డి, అఫ్జల్, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…