పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారి కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యను అభ్యసించాలని కోరారు. ప్రతి ఏటా ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయల పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలను ప్రభుత్వం బలోపేతం చేస్తూందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవూజ, పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…