పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన భోగయ్య కుమారుడు శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. చికిత్స కోసం మంజూరైన 2 లక్షల 50వేల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఆదివారం ఎంఎల్ఏ జిఎంఆర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…