Telangana

ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు వాటి అమలుకు ప్రణాళిక అబద్ధం గా కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో ఆర్థిక అభ్యున్నతి చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెలలో నూతన రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల సంరక్షణ కోసమే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దేవజ, ఎమ్మార్వో రంగారావు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago