మనవార్తలు ,పటాన్ చెరు
ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీ లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, ఆబిద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం తో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తమ రంగవల్లుల లో పొందుపరచడం పట్ల ఆయన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 100 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, సర్పంచ్ ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు రామకృష్ణ, రవి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
___________________________________________________________
_క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం
_లక్డారం ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల పరిధిలోని లక్దారం గ్రామంలో లక్డారం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లక్డారం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, విజయ్ కుమార్, అఫ్జల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.