పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని ,ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని , పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .భక్తులందరూ కరోనా నిబంధనలకు అనుగుణంగా హాజరు కావాలని ఆయన సూచించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సంపూర్ణ సహకారం అందించారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…