మన వార్తలు ,పటాన్ చెరు:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ వారోత్సవాల్లో భాగంగా పటాన్చెరు- రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఉత్తమ స్వచ్ఛతను పాటిస్తున్న ప్రభుత్వ కార్యాలయం గా పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయం ఎంపికైన సందర్భంగా సోమవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో బన్సీలాల్ కు ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి పరిశుభ్రతపై అవగాహన కల్పించిన జిహెచ్ఎంసి సిబ్బందిని అభినందించారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రామచంద్రపురం జిల్లా పరిషత్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, అఫ్జల్, సహాయ వైద్యాధికారి రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…