పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన హంసమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన 4 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి నీ ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.