పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల పరిధిలోని కానుకుంట గ్రామానికి చెందిన హరివర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ ఓ సి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఒక లక్ష 25 వేల రూపాయల ఎల్ఓసిని ఎమ్మెల్యే జిఎంఆర్ సోమవారం పటాన్ చెరు లోని తన కార్యాలయంలో హరివర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీలు దేవానందం, శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకుడు దశరథ్ రెడ్డి, బండి శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ట్రాక్ సూట్ల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : త్వరలో…
నిపుణులైన వైద్యులు అత్యాధునిక వసతులు సేవల్లో దేశంలోనే ఏడవ స్థానం ప్రతి వైద్యుడు సేవా దృక్పథంతో పనిచేయాలి సమస్యల పరిష్కారానికి…
-భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్. -కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం అమీన్పూర్ ,మనవార్తలు…
-మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి…
ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ,…