అమీన్పూర్
అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో నూతనంగా నిర్మించతలపెట్టిన సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబిక భవాని దేవాలయాల భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ట్లు తెలిపారు. సొంత నిధులతో పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ గావించడంతో పాటు నూతన ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదుటివారికి సేవ చేయడం తో పాటు, దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచులు కృష్ణ, మల్లేష్, రవి, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఈర్ల రాజు, సత్యనారాయణ, గ్రామ ప్రజాప్రతినిధులు, బంజారా సేవాలాల్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…