Telangana

ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు . ఈ జాతర కార్యక్రమానికి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గ్రామస్తులు సంప్రదాయ వేషధారణతో స్వామివారికి పూజలు నిర్వహించగా, డప్పు చప్పుళ్లు, భజనలు, హారతులతో ఆలయ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఎమ్మెల్యే జిఎంఆర్ స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు ప్రతీకలని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఇటువంటి పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడే ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలోనూ దైవభక్తిని, సంప్రదాయాలను మరవకుండా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.జాతరల ద్వారా గ్రామాల్లో సామాజిక సమైక్యత, సోదరభావం పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పాల్గొనడం ద్వారా మానసిక శాంతి లభిస్తుందని తెలిపారు. ఐనోలు గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి జాతర మరింత వైభవంగా కొనసాగాలని, స్వామివారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిఐ వినాయక్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు, పాల్గొన్నారు.

admin

Recent Posts

కాంగ్రేస్ నయవంచన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…

4 hours ago

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువత…

5 hours ago

దేశ సాంకేతిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్న డ్రోన్లు

ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మన దేశ…

5 hours ago

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…

2 days ago

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

3 days ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago