పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర, రుద్రారం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. గత దశాబ్ది కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, భానూరు సిఐ స్వామి గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాండు, సుధీర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రాజు, వెంకన్న, నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…