పటాన్చెరు
పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిని ఏర్పాటుకు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుని ఉంటారని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సతీమణి గూడెం యాదమ్మ లను ఘనంగా సన్మానించారు. నూతన ఆసుపత్రి ఏర్పాటుతో నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందన్నారు.
పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకటరెడ్డి, గుమ్మడిదల ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…