Telangana

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 కబడ్డీ జూనియర్స్ పోటీలలో నాలుగో స్థానం సాధించిన తెలంగాణ జట్టుకు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీలలో పాల్గొన్న జట్టు సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జట్టు జాతీయస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి మెరుగైన ప్రదర్శనలతో జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ క్రీడలకు కేంద్రంగా పటాన్‌చెరుని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, జట్టు మేనేజర్ గోపాల్, పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

2 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

2 hours ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

2 hours ago

దేవాలయ భూమిని కాపాడండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…

7 hours ago

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

21 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

22 hours ago