politics

పోచారం మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి జాతర లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలు తెలంగాణ సంసృతికి, ప్రతీకగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్రం వచ్చాక దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు.

ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి , జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago