_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, హరితహారం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి యువతకు ఆశా కిరణంగా నిలిచిన మహోన్నత నాయకుడు మంత్రి కేటీఆర్ అని ప్రశంసించారు. తన జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటాలకు దూరంగా నిర్వహించాలన్న మంత్రి సూచన మేరకు.. అమీన్పూర్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, హెచ్డిసి కమిటీ మెంబర్ శ్రీను, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
_అనాధ ఆశ్రమం లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..
_మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటన..
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.తన పుట్టినరోజును హంగు ఆర్భాటాలకు దూరంగా నిరుపేదల సంక్షేమానికి అండగా నిలుస్తూ నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. మహిమా మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనాధ పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తల్లిదండ్రులను కోల్పోయి మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాధ పిల్లలను చేరదీసి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.ఆశ్రమంలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో భోజనం, యూనిఫామ్, ఉన్నత విద్యను అందించనున్నట్లు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…