Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసలతో అభినందించిన మంత్రి హరీష్ రావు

_మైత్రి మైదానంలో దివ్యాంగుల పండుగ..

_దివ్యాంగులకు దిక్సూచి ఎమ్మెల్యే జిఎంఆర్

_3 కోట్ల రూపాయల సొంత నిధులతో 250 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

_కలలోనైనా ఊహించలేమంటూ ఆనంద భాష్పాలు..

_మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామంటూ ప్రశంసలు..

_10 కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గురవుతున్న దివ్యాంగులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిక్సూచిగా మారారు.గడప దాటాలంటే మరొకరి సహాయం కావలసిన దుస్థితి నుండి సొంతంగా తమ సొంత వాహనంపై వెళ్లేలా అండగా నిలిచారు ఎమ్మెల్యే జిఎంఆర్.మంగళవారం సాయంత్రం పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో.. 250 మంది దివ్యాంగులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాజంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన సంచలమేనని అన్నారు. దివ్యాంగుల కోసం మూడు కోట్ల రూపాయలతో 250 ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలందరూ ఎమ్మెల్యే జీఎంఆర్ ను గుండెలనిండా ఆశీర్వదించాలని కోరారు. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కితాబునిచ్చారు.

సీఎం కెసిఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 3000 రూపాయల పెన్షన్ అందిస్తూ వారు జీవితాల్లో కొత్త వెలుగును నింపుతున్నారని అన్నారు.సమున్నత లక్ష్యంతో అందించిన ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే జిఎంఆర్ విజ్ఞప్తి మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి తో చర్చించి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.250 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.అనంతరం పటాన్చెరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి లయన్స్ ఇండస్ట్రీస్ వరకు 10 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన పైపులు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 250 మంది దివ్యాంగుల కొద్ది చక్ర వాహనాలు పంపిణీ చేయడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ కు వికలాంగుల సంస్థ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుల కార్పొరేషన్ తరపున ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడంతోపాటు స్వయం ఉపాధి అందించేందుకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగుల కోసం ద్విచక్ర వాహనాల పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago