మన వార్తలు , పటాన్ చెరు:
పటాన్చెరు లోనీ కాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఆల్విన్ కాలనీలో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరుగుతుందన్నారు.భారీ వర్షాలు కురిసినప్పుడల్ల నాలా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలనీల రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుందని అన్నారు.నందన్ రతన్ కాలనీలో గత సంవత్సరం అదే జరిగిందనితెలిపారు . ఈ అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితే బండ్లగుడ,నందన్ రతన్ ప్రైడ్, ట్రాంజెల్,ఆల్విన్ కాలనీలలోని మురుగు నీరు మరియు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా సులువుగా ఈ నాలా ద్వారా వెళ్ళిపోతాయని తెలియజేశారు.సుమారు రూపాయలు 2 కోట్ల అంచనా వ్యయంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ గారికి శాలువాతో సన్మానం చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…