కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎం.పి.రఘునందన్ రావు లకు వినతిపత్రం అందజేత
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు విస్తరించాలని మెట్రోరైల్ సాధన సమితి అధ్యక్షులు మాజీ ఎంఎల్ఏ కే. సత్యనారాయణ మరియు సభ్యుల అధ్వర్యంలో కేంద్రబొగ్గుగనుల శాఖా మంత్రివర్యులు కిషన్ రెడ్డి , మెదక్ ఎంపీ రఘునందన్ రావు లకు వినతిపత్రం అందించారు . గత ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు ను విస్తరించాలని ప్రతిపాదించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీ.వో లో పటాన్ చెరు వరకు మాత్రమే ప్రతిపాదించిందని , సంగారెడ్డి జిల్లాకు లాభం జరగాలంటే పారిశ్రామిక వాడ ఇస్నాపూర్ పూర్ వరకు మెట్రో ను పొడగించాల్సిందే అని మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేయడం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేవిధంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి వర్యులను కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘురందన్ రావు ని కోరారు , వారు సానుకూలంగా స్పందించినట్టు మెట్రోరైల్ సాధన సమితి సభ్యులు తెలిపారు .ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ , అబ్దుల్ బాసిత్, ఈర్ల రాజు ముదిరాజ్, మెట్టు శ్రీధర్, పన్యాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…