-హైదరాబాదులో ఆర్ కృష్ణయ్యను కలిసిన నీలం మధు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధును ఆర్ కృష్ణయ్య సాదరంగా స్వాగతించి అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి, తనకు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్యను నీలంమధు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదు అన్నారు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావడం హర్ష నియమన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 64శాతం బిసిల ఓట్లు ఉన్నాయని, ఏదైనా పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వాలంటే భయపడతాయన్నారు. అలాంటిది బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యువనేత నీలంమధును గుర్తించిన కాంగ్రెస్ ఆధినాయక్తవానికి అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎంపీ ఎన్నికల్లో నీలంమధును గెలిపించుకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీసీ కులాలు, ఇతర అన్ని కులాల మద్దతుదారులు సానుభూతిపరులు ఐక్యమై మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని పార్లమెంటుకు పంపించాలని కోరారు. మధును పార్లమెంటుకు పంపితే ఆయన మద్దతు తీసుకొని దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం పోరాడుతామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘం నాయకులు సుధాకర్, నంద గోపాల్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ, తదితరులు నీలం మధును శాలువాలతో సన్మానించి, సంఘీభావం తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…