Telangana

మెదక్ గడ్డ గులాబీ అడ్డా_మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

6 గ్యారంటీలు అంటూఅభయ హస్తం అంటూ అధికారంలోకి వొచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలకు శూన్యహస్తం అందించిందని మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఎద్దేవా చేశారు.పఠాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ లో గల శ్రీ గణేష్ దేవాలయం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి లతో కలిసి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలో కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని, అలివి కాని హామీలు ఇచ్చి ప్రజలను డోఖా చేసిందన్నారు.మార్పు మార్పు అని ఉన్న సంక్షేమ పథకాలకు కొత పెట్టారన్నారు.

పాల పొంగులా కాంగ్రేస్ పాలన అసలు స్వరూపం భయటపడిందన్నారు..6 గ్యారంటీల కోసం రాహుల్, ఏఐసీసీ మాట అన్నారని, 120 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు.మహాలక్ష్మి పథకం లో 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు..రాష్ట్రంలో ఉన్న 1.42 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ బాకీ పడిందన్నారు .42 లక్షల పించిన్ దారులు ఉన్నారని వారికి నెలకు 4వేలు ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. నాడు నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి లు మాట్లాడారని, నేడు తోక ముడిచారన్నారు.. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడం లేదని,కేసీఆర్ కిట్ బంద్ అయిందని, కళ్యాణ లక్ష్మి కి తులం బంగారం,వడ్లకు బోనస్ 500 ఏమాయే అని ఆయన ప్రశ్నించారు. వరి పంటకు బోనస్ 500 ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ అడుగుతే సీఎం రేవంత్ రెడ్డి అవాకులు, చెవాకులు ప్రేలుతున్నారని, నువ్ సీఎం వా లేక చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా అని విమర్శించారు. గణేష్ గడ్డ మనకు అచ్చి వొచ్చిన గడ్డ అని, ఇక్కడ 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, వాహన పూజకు జెండా ఊపడం జరిగిందని, ఘన విజయం సాధించడం జరిగిందన్నారు.నేడు వెంకట్రామరెడ్డి తో కలిసి పూజలు నిర్వహించడం జరిగిందని, గెలుపు కూడా ఖాయమన్నారు.

మినీ ఇండియా లో భారీ మెజారిటీ అందిస్తాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మినీ ఇండియా గా పేర్కొనే పఠాన్ చేరు లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి కి భారీ మెజారిటీ అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.పఠాన్ చెరు లో 6 లక్షల ఓట్లు ఉన్నాయని,మెజారిటీ ఓట్లు రావడం ఖాయమని, పార్టీ శ్రేణులు ఉత్సాహం తో పనిచేయాలన్నారు..ఈనెల 13న సాయంత్రం 4గంటలకు సిఎమ్మార్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకరామిరెడ్డికి రికార్డు మెజార్టీ అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత పదేళ్ళలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. బూత్ స్థాయి నుండి బిఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి వెంకటరామిరెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నన్ను ఆశీర్వదించాలి..అండగా ఉంటాం ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా 11 ఏళ్ళు మీతో పనిచేశానని, ఎంపీ అభ్యర్థి గా ప్రజా సేవకోసమే వొస్తున్నానని అశీర్వదించాలని అండగా ఉంటానని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి కోరారు..నేను పఠాన్ చేరు నియోజకవర్గంలో ని తెల్లాపూర్ వాసినని, ఏ కష్టం వొచ్చినా పిలవగానే వొచ్చి అండగా నిలుస్తానన్నారు..ట్రస్టు ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago