మనవార్తలు ,పటాన్చెరు
సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .తరంగ్ స్వచ్చంధ సంస్థ కరోనా సమయంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన పలు సంస్థలకు అవార్డులను అందించింది. సామాజిక సేవలో MDR ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తిస్తూ అవార్డ్ అందించినట్లు సంస్థ ఫౌండర్ దేవేందర్ రాజు తెలిపారు. ఈ అవార్డు దక్కడంతో మా మీద సేవ కార్యక్రమాల పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు.
ప్రతి ఒక్కరు సమాజం పట్ల సామాజిక అవగాహన, సమాజ సేవలో భాగస్వామ్యం అవ్వాలని MDR ఫౌండేషన్ ద్వార ఆయన విజ్ఞప్తి చేశారు. MDR ఫౌండేషన్ చేసిన కొన్ని సేవలను పలువురు కొనియాడారు, ముఖ్యంగా అనాధ శవాల అంత్యక్రియలు, లాక్డౌన్ పేదలకు అన్నదానం , నిత్యావసర సరుకుల పంపిణీ తదితర సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మునుముందు మరిన్ని సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు .