Districts

నిరుపేదలకు అండగా ఎండిఆర్ ఫౌండేషన్.

–దివ్యాంగుల భ్రతుకు భరోసాకు చేయుతనిచ్చిన విక్రం ముధిరాజ్.

–సంతోషించి ఎండిఆర్ ఫౌండేషన్ ను దీవించిన నిరుపేద తల్లి.

మన వార్తలు ,పటాన్ చెరు:

పేద ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు పాటు పడుతుంది ఆ కుటుంభం. అన్నా ఆపద ఉంది అనగానే తక్షణం స్పందించే గుణం, భ్రతుకుదెరువుకు ఆర్ధిక భరోసాకలిగించే నైజం ఆ కుటుంబానిది. పటాన్చెరు నియోజక వర్గంలో నిరుపేదలు ఎవరు వచ్చి తలుపు తట్టినా కాదనకుండా వారికి ధైర్యంగా, అండగా నిలుస్తు ప్రజల ఆదరణ చూరగొంటున్నది ఆ కుటుంబం . అటువంటి మహోన్నతమైన కుటుంబంఎండిఆర్ ఫౌండేషన్, టిఆర్ఎస్ నియోజక వర్గ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా ప్రజలు భాగుండాలని నిత్యం కృషి చేస్తుంటారు. వందల మంది పేద కుటుంభాలకు దారిచూపారు.

పటాన్చెరు పట్టణంలో ఏ నోట విన్న ఆయన పేరు వినిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దేవేందర్ రాజు  కాక వారి కుటుంబ సభ్యులు కూడా నిస్వార్ధంగా పేద ప్రజలకు తోడుగా నిలుస్తుండడంతో ప్రజలంతా చేరువవుతున్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను చూసి ఓ దివ్యాంగుల కుటుంభం ఎండిఆర్ ఫౌండేషన్ ను ఆశ్రయించింది. బ్రతుకుదెరువు ఉపాది కల్పించాలని కోరగా ఆ కుటుంభం చాయ్ దూకాన్ ఏర్పాటు చేసుకుని ఉపాది పొందేందుకు ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా దేవేందర్ రాజు  సోదరుడు విక్రం ముదిరాజ్ ఆ పేద కుటుంభానికి మంగళవారం ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఆర్ధిక చేయుతనందుకున్న ఆ కుటుంభం కన్నీటి పర్యాంతమైంది. అన్న అని అడగగానే ఉపాది మార్గం చూపించినందుకు అంబేద్కర్ కాలనీ లో ఉండే ఆ నిరుపేద తల్లి సంతోషం వ్యక్తం చేసింది.  కలకాలం ఎండిఆర్ ఫౌండేషన్, వ్యవస్తాపకులు, సభ్యులు వర్ధిల్లాలని ఆశీర్వదించింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago