పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతు జాతరలు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని , గ్రామాల్లో జరిగే ఉత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజలంతా ఐక్యమత్యంగా కలిసి ఉంటారన్నారు. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుర్మ వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య,వి నారాయణ రెడ్డి, ముత్తంగి అశోక్, బంటు రాములు,ప్రభు, గణేష్, ప్రశాంత్,మహేష్,సతీష్,చంటి, నాగరాజు, కురుమ సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…