Telangana

అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

​కన్నులపండువగా 50 జంటలతో నిర్వహణ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు పట్టణం శాంతినగర్ కాలనీ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఆలయ అధ్యక్షుడు నర్ర బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు రమా సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 50 మంది దంపతులు ఒకే వేదికపై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు.​. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. నందిగామ శంకరప్ప సుమారు 500 ల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు నర్ర బిక్షపతి మాట్లాడుతూఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభాగ్యాలను పెంపొందిస్తాయని, ఇలాంటి సామూహిక వ్రతాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి, అయ్యప్ప స్వామివార్ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఆలయాభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యార్థం మున్ముందు కూడా ఇటువంటి అనేక భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్, సుధాకర్ స్వామి,నవాజ్ రెడ్డి, అంజి స్వామి, రామస్వామి, చందు స్వామి,నర్ర వీరేశం, నర్ర శైలజ బిక్షపతి, రమా సంజీవరెడ్డి, నాగరాణి, కవిత, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago