మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమలో వేడి నీళ్లు పడి చికిత్స పొందుతు, మృతిచెందిన వెంకటేశ్వర్లు కుటుంబానికి ఎంఎస్ఎన్ యాజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని చిట్కుల్ పార్థసారథి నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమలలో గత 13 సంవత్సరాలుగా ఫిట్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడన్నారు. ఈనెల11న పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఎంఈ ప్లాంట్ లోని ఎఫ్లుమెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లో తుప్పు పట్టిన పైప్ లైన్ ను విప్పుతుండ గా పైప్ లైన్ లీకేజీ అయి వెంకటేశ్వర్లు శరీరం మీద పడడంతో శరీరం పూర్తిగా కాలిపోయిందని, వెంటనే కాంచన్ బాగ్ డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. పాతకాలపు పనిముట్లు, పైప్ లైన్ వాడడం వల్లనే ఎమ్మెస్ ఎన్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే వెంకటేశ్వర్లు చనిపోవడం జరిగిందని, వెంకటేశ్వర్లు మృతి చెందడానికి కారణమైన ఎంఎస్ఎన్ పరిశ్రమ యాజమాన్యం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎంఎస్ఎన్ పరిశ్రమలో అనేకమంది కార్మికులు అనేక సందర్భాలలో మృతి చెందుతున్న బయటకు రానివ్వకుండా పరిశ్రమ యాజమాన్యం దాచిపెడుతూ, కార్మికుల కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారాలు చెల్లించకుండా, కార్మికుల కుటుంబాలను పూర్తిగా రోడ్డు మీద పడేస్తున్నారని ఆరోపించారు. ఎంఎస్ఎన్ పరిశ్రమ వలన రుద్రారం గ్రామం పూర్తిగా వాయు కాలుష్యం, పెద్ద చెరువు పూర్తిగా జల కాలుష్యంతో నిండిపోయి చివరికి చేపలు చనిపోయిన సంఘటనలు ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసినప్పటికీ పరిశ్రమ యజమాన్యం పైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అనేక పరిశ్రమల్లో సంఘటనలు జరుగుతున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమలో తనిఖీలు చేయకుండా కార్మికుల మరణాలకు కారణం అవుతున్నారని విమర్శించారు.
అందుకోసం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో చర్చించి పరిశ్రమలో చికిత్స పొందుతూ మృతి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం యాజమాన్యం చెల్లించేలా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఎంఎస్ఎన్ పరిశ్రమ ముందు బాధిత,కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పరిశ్రమ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…